180 కోట్లతో రానా  హిరణ్య కాశిప

31 Mar,2019

బాహుబలి సినిమా భారీ సినిమాలు నిర్మించేందుకు కొత్త ఊపునిచ్చింది. కంటెంట్ ని నమ్ముకుని భారీ బడ్జెట్ పెడితే వసూళ్లు కూడా అదే రేంజ్ లో ఉంటాయని ఏకంగా 2000 కోట్ల వసూళ్లతో నిరూపించి సత్తా చాటింది. ఇప్పుడు బాహుబలి స్ఫూర్తి తో ఒక్క తెలుగులోనే కాదు .. హిందీ, తమిళ, మలయాళ భాషల్లో భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే తమిళ, హిందీ, తెలుగు భాషల్లో 200 కోట్ల బడ్జెట్ తో సినిమాలు రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజగా తెలుగులో మరో భారీ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఏకంగా 180 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమాలో హీరోగా రానా నటిస్తాడట. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రానికి ''హిరణ్య కశిప'' అనే టైటిల్ ఫిక్స్ చేసారు. రుద్రమదేవి సినిమా తరువాత దర్శకుడు గుణశేఖర్ ఈ ప్రాజెక్ట్ పైనే ఫోకస్ పెట్టాడు. నిజానికి తక్కువ బడ్జెట్ లోనే చేయాలనీ ముందు ప్లాన్ చేశారట కానీ ఈ కథని భారీ స్థాయిలో తీస్తే తప్ప ఆ క్రేజ్ రాదని గ్రహించిన దర్శకుడు భారీగా తెరకెక్కించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇప్పటికే రీసెర్చ్ కూడా పూర్తీ కావొచ్చిందట. అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించే సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేస్తారట. అన్నట్టు ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుందని టాక్.  త్వరలోనే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 

Recent News